అమన్ దీప్ కౌర్ 2008లో మొదటి సారిగా బౌన్సర్ గా చంఢీఘడ్ లోని ఒక పబ్ లో చేరింది. ఆనాటికి ఆమెకు బౌన్సర్ గా తను చేయబోయే జాబ్ ఎలా ఉంటుందో ఎమో తెలియదు. ముందుగా ఆమె టి.వి అనౌన్సర్ గా పని చేసింది. పంజాబ్ చర్నాలో జిల్లాకు చెందిన అమన్ దీప్ స్కోర్ అనే డిస్కోథిక్ లో విద్యార్థి, పార్ట్ టైం జాబ్ గా బౌన్సర్ వృత్తిని ఎంచుకుంది. వారంలో నాలుగు రోజులు రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారు జామున రెండుగంటల వరకు పని చేసేది. ఇండియాలో మొట్టమొదటి బౌన్సర్ గా అంతర్జాతీయంగా వార్తాల్లోకెక్కింది. అటు తరువాత అమన్ దీప్ బాటలో ఎంతో మంది బౌన్సర్లుగా ఉద్యోగాల్లో చేరారు.

Leave a comment