Categories

క్విజ్ ఎక్సపర్ట్ శరణ్య జయ కుమార్ 85 ఏళ్ళ వయసులో క్విజ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకొన్నారు.ఆమె రాసిన థౌజండ్ రెలిజియన్ క్వశ్చన్స్ కు ఎంతో మంచి పేరుంది.ఇందులో మతాలకు సంబంధించిన వెయ్యి ప్రశ్నలుంటాయి.ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేసిన శరణ్య ఎన్నో క్విజ్ కాంపిటిషన్స్ లో పాల్గొని ట్రోపీలు గెల్చుకున్నారు.ఔత్సాహిక క్విజ్ ప్రేమికుల తో మోటెల్ క్రూ అనే టీమ్ స్థాపించారు.భారత దేశం లో మొదటి క్విజ్ మాస్టర్ కూడా శరణ్య జయకుమార్.కొత్త పుస్తకాలు నిరంతరం చదవడం తోనే క్విజ్ లో పాల్గొనగలిగాను అంటారు శరణ్య జయకుమార్.