మొదటిసారిగా జుట్టుకు రంగు వేసుకుంటున్నప్పుడో లేదా ఇక ఇంట్లోనే ట్రై చేద్దామని సదుద్దేశం కలిగినప్పుడో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రంగుతో వచ్చే సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి . లేకపోతే రంగు సరిగా అంటకపోవటం వారం  లోపునే వేసిన రంగు పోవటం జరుగుతోంది. రంగు వేయాలనుకుంటే శిరోజాలు నూనె పట్టకుండా ఉండాలి. తలస్నానం చేసి పొడిగా ఉండాలి. మంచి కండిషనర్ వాడి తలస్నానం చేస్తే మృదువుగా సాఫీగా ఉంటుంది. అప్పుడే రంగు జుట్టుకు బాగా అంటుకుంటుంది. రంగు వేసాక ప్రతి రోజు తలస్నానం చేయద్దు . తలకి రంగు  వేసుకున్న తర్వాత వేడి నీటి స్నానం వద్దు . వేడి నీరు కుదుళ్లను తెరచి వుంచుతుంది. అంచేత గోరు వెచ్చని నీళ్లు చల్లని నీళ్ళో వాడాలి . వాడే షాంపూల్లో సల్పెట్లు లేనివి కలర్ సేఫ్ రకాలు ఎంచుకోవాలి . పదే పదే  రంగు వేసే బదులు అప్పుడప్పుడే రసాయనాలు లేని హెర్బల్ డై కూడా ప్రయత్నించవద్దు . ఇవి జుట్టుకు చర్మానికి హాని చేయకుండా ఉంటాయి.

Leave a comment