అంతర్జాతీయ పత్రిక పీకాక్ మ్యాగజైన్  మలీషా ఖర్వా ను అక్టోబర్ 2020 సంచిక కవర్ పేజి పైన వేశాక మలీషా ముగ్ధత్వం రూపం నవ్వు ప్రపంచానికి తెలిసింది ముంబై మురికి వాడలో జన్మించిన మలీషా తండ్రి పార్టీ లో జోకర్ వేషం వేసి పొట్ట పోసుకునే వాడు. మలీషా మాత్రం మోడల్ అవ్వాలనుకుంది. హాలీవుడ్ నటుడు  రాబర్ట్‌ హాఫ్‌మ్యాన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం మురికివాడలో వెతుకుతుంటే వచ్చి పరిచయం చేసుకుంది మలీషా ఆమె పేరుతో ఇంస్టాగ్రామ్ పేజీ ఏర్పాటు చేసి ఆ అమ్మాయి ఫోటోలు అందులో పోస్ట్ చేశాడు లక్షల మంది ఆమె ఫాలోయర్స్ అయ్యారు. లీవ్ యువర్ ఫెయిరీ టేల్ అన్న డాక్యుమెంటరీలో మలీషా మరో నలుగురు స్లమ్ పిల్లలతో కలిసి యాక్ట్ చేసింది, ఈ మధ్యనే యూట్యూబ్ లో రిలీజైంది.ఇది మలీషా కలలు నెరవేరే సమయం.

Leave a comment