మిస్ యూనివర్స్ గా ఎంపికైన హర్నాజ్ సంధూ నాకు మంచి స్నేహితురాలు. ఇద్దరివీ భారతీయ మూలాలే గత 35 ఏళ్లలో సింగపూర్ కు చెందిన ఏ అమ్మాయి మిస్ యూనివర్స్ సెమీఫైనల్స్ వరకు వెళ్లలేదు. జడ్జి అడిగిన ఎన్నో ప్రశ్నలకు నేను నిజాయితీగా సమాధానాలు చెప్పాను ఆ నిజాయితీ నన్ను సెమీ ఫైనల్స్ కు తీసుకు వెళ్ళింది అంటుంది నందితా బన్నీ. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే నందిత నేను పుట్టి పెరిగింది సింగపూర్ లో, ఆ దేశపు జెండా కు ప్రాతినిథ్యం వహించేందుకు నాకు గర్వంగా ఉంది అంటోంది. మిస్ సింగపూర్ గా ఎంపికై మిస్ యూనివర్స్ పోటీల్లో సెమీఫైనల్స్ వరకు వచ్చిన తెలుగమ్మాయి నందిత ఇక మోడలింగ్ నా భవిష్యత్తు అంటోంది.

Leave a comment