పసితనంలో పిల్లలు చేసే అల్లరి తల్లితండ్రులకు తీపి జ్ఞాపకం . ఫ్రెంచ్ పిల్ల  టిప్పీ డెగ్రే ను కన్న తల్లితండ్రులు వైల్డ్ లైన్ ఫోటోగ్రాఫర్స్. ఈ పాప చిన్నతనం అంతా  చిరుతలు, మొసళ్ళు, పాములు, కప్పలు, మధ్యనే నడిచింది.  టిప్పీ 23 సంవత్సరాలు వచ్చాక వాళ్ళ అమ్మనాన్న ఆ పాప జంతువుల మధ్య ఎలా ఆడుతూ పడుతూ వుందో  ఆ ఫోటోలలో  టిప్పీ ఆఫ్ ఆఫ్రికా పేరుతో  పుస్తకం వేసి గిఫ్ట్ గా ఇచ్చారట, ఏడేళ్లు వచ్చే దాకా  మా పాప  క్రూరమైన జంతువులతో టెడ్డీ బేర్ లతో ఆడినట్లు ఆడేది అని చాలా  సంతోషంగా చెపుతున్నారు  టిప్పీ అమ్మ నాన్న. ఆ ఫొటోలు  పుస్తకం ఇప్పుడు పెద్దయి పోయిన టిప్పీ ని మీరూ చూడండి. పిల్లలకు మనం కుడా మంచి జ్ఞాపకాలు ఇవ్వగలం.

Leave a comment