యాంటిక్ డైమండ్స్ జ్యువెలరీ కొనే సమయంలో తరుగు,తయారీ ,నాణ్యత వంటి విషయాలు సరిగ చూసుకొంటే సరైన నగలు ఎంచుకోవచ్చు . యాంటిక్ జ్యువెలరీ ,టెంపుల్ స్టయిల్ తో తయారుచేస్తారు . అయితే వీటి తయారీ లో జరిగే వెస్టీజ్,ఆభరణం ధరకు కలిపేస్తారు . అన్ కట్ లో మోజనైట్ డైమండ్స్ కాస్త ఖరీదు తక్కువే . ఆఫీస్ ,కాలేజ్ లకు వెళ్ళే అమ్మాయిలు కాస్త తక్కువ ఖర్చుతో వచ్చే ఈ మోజనైట్ సెట్ లు కొనుక్కోవచ్చు . ఐదారేళ్ళ కు మెరుపు తగ్గినా మాళ్ళీ పాలిష్ చేయించుకోవచ్చు . అన్ కట్ డైమండ్స్ కింద సిల్వర్ పేపర్ వేసి బంగారం తో మూసేసే పచ్చి వక్కతో తయారైన సెట్ కొనుక్కొంటే మార్పిడి చేస్తే ధరలో 80 శాతం మాత్రమే రాబట్టుకోగలుగుతారు . పెట్టుబడి కోసం నగలే కనుక్కోమంటారు ఎక్స్ పర్డ్స్ .

Leave a comment