ఎండ తీవ్రంగా వుంది కదా, కనీసం ఇప్పుడయినా అందమైన పూల మొక్కలు, ఇంటి లోపల ఆరోగ్యంగా పెరగగలిగే మొక్కలను వేసవికి అనుకూలంగా ఉండేవి ఎంచుకోమంటున్నారు గార్డెనింగ్ ఎక్స్ పర్ట్స్. ఫిలడెండ్రియా, స్వాతి ఫైలమ్, ఇంగ్లీష్ ఐవీ, ఇలాంటి వాటిల్లో కొన్ని ‘NASA’ కూడా వీటిని గాలిని సుద్ధి చేసే మొక్కలుగా గుర్తించింది. వీటిని గది మూలల్లో ఉంచితే చల్లదానాన్ని ఇస్తాయి. పడక గది కిటికీల పక్కన ఎండ బాగా తగిలితే గోడల దగ్గర మొక్కల్ని పెట్టుకోవాలి. వీలైతే కిటికీలకులతలా పకించాలి. తోడుగా వట్టి నీళ్ళ చాపలు కర్టెన్లుగా కడితే ఇంకా చల్లగా అయిపోతుంది ఇల్లు. పెద్ద భవనాలకు ఎండ తీవ్రత ఎక్కువ. డాబా ఖాళిగా వుంటే సమస్య మింతగా వుంటుంది. పైగా వీలైనంత ఎక్కువగా డాబా నిండా ఖలీ లేకుండా కుండీలు పెట్టుకుని ప్రతి రోజు వాటిని నీళ్ళు పెడితే చెట్లన్ని పచ్చగా ఎదిగి డాబా మొత్తం పచ్చదనం తో నిండి పోయి ఎండ తగ్గిపోతుంది. పైగా ఈ చిన్ని నాజుకైనా చెట్లు కూడా ఎండకి సొమ్మసిల్లి పోకుండా వాటికి గ్రీన్ షెడెడ్ నెట్ ఎంచుకోవాలి. మొత్తానికి మొక్కలు ఏసీల్లా పనిచేస్తాయి అంటున్నారు.
Categories