ఎండలు పెరుగుతున్నాయి ఇంట్లో పెంచుకొనే ఇండోర్ ప్లాంట్లు కూడా ఎండకు వాడిపోతాయి పీస్ లిల్లీ,కోలియస్ ఆంధురియం కెలడియం వంటివి త్వరగా వేడికి గురవుతాయి ఎండకు,ఎసి నుంచి వచ్చే పొడిగాలికి నీళ్లు త్వరగా ఆవిరి అవుతాయి. పశ్చిమ దక్షిణ దిశల్లో ప్లాంట్స్ ని వేరే చోటికి మార్చాలి. కిటికీలు,బాల్కనీలలో షేడ్ నెట్ లు లేదా నీళ్లతో తడిపిన గొనె సంచి లు వేలాడదీయాలి. ఎండవేడి లో ఉన్నప్పుడు మొక్కను మరోదానికి మార్చటం ఎరువులు వేయటం,కత్తిరించటం చేస్తే మొక్కలు కోలుకోలేవు.

Leave a comment