పచ్చదనం కనబడితే కళ్ళు మనస్సు కుడా చల్లబడతాయి. ఇప్పుడు ఫేస్ బుక్ లో, సోషల్ మీడియా లో ఇంటి తోటల పెంపకం గురించి కబుర్లు ఎన్నో ఇంటి ముందో వెనకో కాస్త ఖాళీ దొరికినా దాన్నిండా మొక్కలు నింపేయాలని చూస్తున్నారు. మొక్కల పెంపకం ఆహ్లాదమేకాదు  చక్కని ఫిట్నెస్ తో వుండేందుకు కుడా దోహదం చేస్తుంది. గార్డెనింగ్ చేసే వాళ్ళు చురుగ్గా వుంటారు. వారంలో కేవలం రెండున్నర గంటలు గార్డెనింగ్ చేస్తే వరం మొత్తం మనసుకి ఆనందంగా ఉంటుందిట. ఒత్తిడిని తగ్గించుకునేందుకు గార్డెనింగ్ సరైన యాంటీ డాట్. దీని వల్ల కలిగే ఫలితాల్లో ఆత్మవిశ్వాసం, ఉల్లాసం పెరుగుతాయని ముఖ్యంగా చెపుతున్నారు. ఇప్పుడు పని టెన్షన్ నుంచి ద్రుష్టి మరల్చెందుకు ఆఫీసుల్లో పచ్చని మొక్కలు ఉంచుతున్నారు. ఒక వాతావరణాన్ని పాజిటివ్ గా మార్చడం తో మొక్కలు మించిన అలంకరణ ఇంకోటి లేదు.

Leave a comment