బరువు సమస్యతో కడుపు మాడ్చేయటం , లేదా అదే దిగులుతో ఇంకాస్త ఎక్కువ తినటం పెద్ద సమస్యతో ఆనారోగ్యాల పాలవకుండా ,మొలకెత్తిన గింజలు తినండి అదే పరిష్కారం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మొలకెత్తిన గింజల్లో క్యెరెట్ ,కాప్సికం ముక్కలు ,కొత్తిమీర కరివేపాకు దానిమ్మగింజలు టోమోటో ముక్కలు కలిపి చక్కని ఉల్పహారం తయారు చేసుకొని ఉదయం వేళ తింటే ఎంతో ప్రయోజనం అంటున్నారు . దానికి ఇంకాస్త నిమ్మరసం కలిపితే రుచితో పాటు జీవక్రియ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ రాదు . రక్త హీనత కూడా రాదు. మొలకెత్తిన గింజల్లో ఉండే విటమిన్స్ ఖనిజాలు గుండెకు మేలు చేస్తాయి. శనగలు పెసలు వంటి మొలకలు రెగ్యూలర్ గా ఇంట్లో తయారు చేసుకోండి అంటున్నారు నిపుణులు.

Leave a comment