వెల్లుల్లిపాయల్లో మొలకలోస్తే తాజావాటికన్నా వీటిలోనే గుండె కు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని అమెరికన్ కెమికల్ సొసైటీ నిపుణులు చెబుతున్నారు. ఇలా మొలకలొచ్చిన పాయల్లో రకరకాల మెటాబోలైట్లు ఉన్నట్లు నిపుణులు కనిపెట్టారు. సాధరణంగా ఇవి గింజ మొలకల్లో కనిపిస్తాయి. మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబోలైట్లు రక్షిస్తాయి.మామూలుగానే వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్, బీపీ తగ్గిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది.
మొలకలోచ్చిన వెల్లుల్లిలో ఇంకెన్నో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Leave a comment