కరోనా భయంలో , లాక్ డౌన్ తో ఇంట్లో అందరం ఇల్లు కదలకుండా కుర్చింటారు కానీ ఇప్పుడొక్క ఇల్లాలికే సమస్య అంతా ఇంట్లో సాయం చేసే వాళ్ళు రారు .పిల్లలు ఇంట్లోనే ఉంటారు .బట్టలు , అంట్లూ , వంట , ఇల్లు క్లినింగ్ ఆమెనే చేయాలి .ఇంకా ఆమె ఉద్యోగి అయితే వర్క్ ఫ్రొమ్ హోమ్ ఉంటుంది .అందుకే అమ్మ కు తప్పని సరిగా పనుల్లో సాయం చేయాలి .ఏం వండిన వంకలు పెట్టకుండా తినాలి .ఇంట్లో పనులన్నీ టైం టేబుల్ వేసుకొని అందరూ షేర్ చేసుకోవాలి .ఇవి పిల్లలు చేయ దగ్గవి , ఇవి పెద్దవాళ్ళు చేసేవి అంటూ పనులు ఎంచుకొని అమ్మకు కష్టం లేకుండా చేస్తే ఇల్లంతా ఆనందం , ఉత్సాహం ఉంటాయి . పనులు తపించు కోవద్దు చక్కగా పంచుకొనే సమయం ఇదే .

Leave a comment