డబ్బు చెట్లకు కాయివు అని చాలా సార్లు వింటూ ఉంటాం . కానీ ఇంగ్లాండ్ లోని ఉడ్ లాండ్ లో కొన్ని చోట్ల డబ్బుల చెట్లు కనిపిస్తాయి . హటాత్తుగా వాటి వైపు చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది . ఒక్కో చెట్టుకి వేలాది నాణేలు గుచ్చి ఉంటాయి . అచ్ఛంగా చెట్టులొంచి పొడుచుకు వచ్చి చెట్టుకు కాసినట్లే ఉంటాయి . అందుకే వీటిని మనీ ట్రీ అంటారు . ఈ చెట్లకున్నా డబ్బు మనుషులు పెట్టినవే . మన దేశంలో దేవాలయాల్లో, నదుల్లో డబ్బు వేస్తే పుణ్యమని ఎలా అనుకుంటామో ఇంగ్లాండ్ లో వందల ఏళ్ళ నుంచి వృక్షాల్లో చిల్లర డబ్బు వేస్తే  అదృష్టం అని నమ్మేవాళ్ళు . చెట్టు పై ఉన్నా ఆత్మలు సంతోషించి తమ కోరికలు తీరుస్తాయని నమ్ముతారు . ఇప్పటికి దాన్ని నమ్మేవాళ్ళు క్రిస్మస్ రోజు మిఠాయిలు కూడా పంచుతారు . ఈ చెట్లని ప్రభుత్వమే జాగ్రత్తగా కాపాడుతుందట . ప్రజల నమ్మకాలని గౌరవించని ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందా ?.

Leave a comment