భార్య భర్తలగొడవలకు సగం కారణం డబ్బే అంటున్నారు ఎక్సపర్ట్స్. విడాకుల వ్యవహారాల్లో సగం కేసులు ఆర్ధిక వ్యవహారాలతో ముడిపడినవే. ఇక్కడ సమస్య డబ్బు లో లేదు ఒక అధ్యయనం ప్రకారం,30 శాతం మంది దంపతుల్లో డబ్బు విషయం నిజాయతీగా వ్యవహరించటం వల్ల గొడవలు వచ్చాయని రుజువైంది. జీవిత భాగస్వామి కి తెలియకుండా అప్పులు చేయటం ఆ వ్యవహారం పూర్తిగా దాచి పెట్టటం,ఇక ఆ అబద్దం సంపాదన విషయం లోకి వెళ్ళటం మొత్తంగా గొడవలకు కారణం అవుతున్నాయి. దుబారా ఎంత ప్రమాదమో పిసినారితనం కూడా అంతే ప్రమాదం. ఈ ఆర్ధిక విషయాల గురించి పెళ్ళికి ముందే మాట్టాడుకొని అభిప్రాయ బేధాలు లేకుండా చూసుకోవటం బెటర్ అంటారు అధ్యయనకారులు. ఆర్ధిక విషయాలను ఆరోగ్య కరమైన వాతావరణంలో చర్చించుకోవాలి. అప్పుడే గొడవపడే అవకాశాలు ఉండవు.

Leave a comment