ప్రకృతి లో చాలా అందమైన అపూర్వమైన,ఆర్కిడ్స్‌ పూస్తున్నాయి. వీటిలో కొన్ని ఒక్క జివి ఆకారంలో ఉండి ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి.  థాయ్‌లాండ్‌, బర్మా, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే ప్యారెట్ బల్సామ్‌ మొక్కని చూస్తే కొమ్మకొమ్మకీ చిలకలు వాలినట్లు పూలు వస్తాయి. పూవు పై రేకులు పొడుగ్గ ఉండి చిలుక లగే కనిపిస్తాయి. అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కనిపించే కాలియానా మైనర్ రకం ఆర్కిడ్ ఎగిరే బాతు ఆకారం లో ఉంటాయి. ఇంపేషన్స్‌ బెక్వార్టి మొక్క తూర్పు తూర్పు ఆఫ్రికాలోని వర్షారణ్యాల్లో మాత్రమే కనిపిస్తుంది. తెలుపూ లేత గులాబీ రంగులో పుష్పించే వీటి పూలు చిన్న పాప స్కర్టు వేసుకుని బెల్లారినా నృత్యం చేస్తున్నట్లే ఉంటుంది. యాంగ్యులోవా యూనిఫ్లోరా ఆర్కిడ్స్ స్వాడెల్డ్‌ బేబీ ఆర్కిడ్స్‌ అనీ అంటారు.ఈ పూలు ఊయల్లో దుప్పటి కప్పుకొన్న పాపాయి లా ఉంటాయి. పోర్చుగల్‌, లెబనాన్‌ లలో కనిపించే పూవులను స్మైలీ బీ ఆర్కిడ్‌ అనీ పిలుస్తారు. వీటిని చూస్తే తేనె టీగలు నవ్వుతున్నట్లుంటాయి. డ్రాకులా జాతి ఆర్కిడ్స్ లో పూలు అచ్చం కోతులు,కొండముచ్చులూ ముఖాలతో ఉంటాయి. బటర్‌ ఫ్లై ఆర్కిడ్‌ పూవుల మధ్యలో రేకులు అచ్చం ఏనుగు తొండం లాగా ఉంటాయి. చిత్రవిచిత్రమైన పుష్ప రూపాలతో ప్రకృతి మనల్ని ఎప్పుడు ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది.

Leave a comment