బ్యాక్  వర్కవుట్ తో చక్కని మూడ్ వస్తుంది అంటున్నారు పరిశోధకులు.  ఒక్కసారి మూడ్ ఆఫ్ అయిపోతుంది ప్రత్యేక కారణం ఏదీ అనిపించదు.  మూడ్ కంట్రోల్లోకి తెచ్చుకోవాంటే మోకాళ్ళపై కూర్చోని వెన్నుని వీలైనంత వెనక్కివంచితే చక్కని మూడ్ వస్తుంది అంటున్నారు పరిశోధకులు.  యోగా వల్ల మూడ్ ఏవిధంగా మారుతోందో మూడ్ మార్చటంతో వాటికి గల శక్తిని గురించి చేస్తున్న పరిశోధనలో ఈ విషయం తెలింది.  వెనక్కీ ముందుకీ వంగటం ,నిలబడటం ఆధారంగా చేసే యోగా పాశ్చర్ లతో ఉత్తమమైన పోజ్ వెనక్కి వంగటమేనన్నారు ఎక్స్ పర్ట్స్. ఈ బ్యాక్ వర్కవుట్ ను యోగా నిపుణుల సాయంతో ప్రాక్టీస్ చేసి మరీ మంచి మూడు పొందవచ్చంటున్నారు.

Leave a comment