ఈ కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగున్నర కోట్లకు పైగా మహిళలు, అమ్మాయిలు కడు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి చెపుతోంది. వీరిని దారిద్యరేఖకు ఎగువన తీసుకొచ్చేందుకు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషి నిష్ఫలం కానుంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ అంచనా ప్రకారం కరోనా సంక్షోభం మహిళల్ని మరింత పేదరికంలోకి నెడుతుంది.కొవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా సుమారు 9.6 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టివేయనుంది. వీరిలో 4.7కోట్ల మంది మహిళలు, అమ్మాయిలు ఉండనున్నారు.ఈ సంఖ్య 2030 వరకూ ఇలానే ఉండనుంది అని యూఎన్‌డీపీ చెబుతోంది. కరోనా తో అన్ని దేశాల్లో పేదరికం పెరగనుంది.

ReplyForward

Leave a comment