రాగికి బాక్టీరియా ను నాశనం చేసే శక్తి  వుందని ఇది వరలోనే పరిశోధనలు రుజువు చేశాయి. రాగిలోని అయాన్లు బాక్టీరియా కణత్వచం లోకి ప్రవేశించి అవి చనిపోయేలా చేస్తాయి. అయితే దీని ఉపరితలం నున్నగా ఉండటం చేత అయాన్లు బాక్టీరియా లోకి ప్రవేశించేందుకు కొన్ని గంటలు పడుతోంది. అదే రాగిని లేజర్ కిరణాలతో చర్య పొందేలా చేయటం వల్ల ఈ ఉపరితలం గరుకుగా మారి అయాన్లు ప్రవాహం వేగం పెంచుకొని బాక్టీరియా త్వోరగా నశిస్తుందని పరిశోధికులు చెపుతున్నారు. ఆర్దోపెడిక్ ఇంప్లాట్స్ కు వాడే లోహాలకు ఈ పద్ధతి ఉపయోగించడం వల్ల అవి చుట్టు ఉన్న కణజాలానికి త్వరగా అతుక్కుంటాయని చెపుతున్నారు.

Leave a comment