Categories
భారతదేశం నుంచి ఐదుగురు అనాధ ఆడ పిల్లలను దత్తత తీసుకుంది అమెరికా టీచర్ క్రిస్టిన్ గ్రే. ఓహియో రాష్ట్రంలోని సిన్ సినాటీ లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేసే క్రిస్టిన్ పెళ్లి బంధం లోకి వెళ్ళ దలచుకోలేదు అనాధ పిల్లలను చేరదీయాలనుకుంది. మహిళా కళ్యాణ్ కేంద్ర నుంచి ఆమె దత్తత తీసుకున్న పాపను తల్లి చెత్తకుప్పల్లో వదిలేస్తే కుక్కలు ముక్కు కొరికాయి. ఇంకో పాపకు ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి ఇంకో ఇద్దరు పిల్లలు కూడా ఆమె కుటుంబంలో కలిశారు. ఇంతమంది పెంపకం కోసం క్రిస్టిన్ రియల్ ఎస్టేట్ లో దిగింది. జీవితాన్ని అర్థవంతం చేసుకోవటం అంటే ఇలాగే ఉంటుంది కదా. అన్నట్లు 2020లో డౌన్ సిండ్రోమ్ ఉన్న ఇంకో అమ్మాయిని కూడా దత్తత తీసుకుంది క్రిస్టిన్.