క్యారెట్ తింటే గుండెకు కూడా మంచిదంటున్నారు ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. డైట్ లో తీసుకున్న బీటా-కెరోటిన్ శరీరంలోకి చేరుకున్నాక విటమిన్ ఏ గా మారుతుంది ఈ కన్వర్షన్ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అంతే కాకుండా గుండె జబ్బులకు కారణమయ్యే అథిరోస్కెలెరోసిన్ డెవలప్ కాకుండా చూడటం లోనూ ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ జబ్బుతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూడటంలో క్యారెట్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Leave a comment