ఆఫీస్ లో రోజుకు ఎనిమిది గంటలు పైగా పనిచేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం 80 శాతం వరకు పెరుగుతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఒవర్ టైమ్ చేయటం అన్నది అనారోగ్యానికి ఎప్పటికైనా హానికరమే అనీ,గుండెకు సంభందించిన అనేక అనారోగ్యాలకు కారణం ఇదేనని చెపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ అధ్యయనంలో శరీరం ఎక్కువ సేపు వత్తిడి ని తట్టుకోలేదని పరిమితి దాటగానే శరీరం ఇచ్చే హెచ్చరికలను పట్టించుకోవాలని పరిశోధకులు చెపుతున్నారు. పని వేళలు పెరగటం వల్ల ఆహార,వ్యాయామ విశ్రాంతి అలవాట్లతో వచ్చిన మార్పులు శరీరాన్ని అనారోగ్యాలకు గురి చేస్తాయంటున్నారు.

Leave a comment