ఒక అపూర్వమైన అనుభవం స్త్రీకి గర్భవతి కావడం కవుల కల్పనల్లో, బొమ్మల్లో తల్లి గా వుండటాన్ని అద్భుతంగా వర్ణించారు కానీ నిజంగా కడుపులో బిడ్డను మోయడం అంత సులభం ఎవీ వుండదు గర్భం దాల్చాక ఎదుర్కొనే తోలి ఇబ్బంది వేవిళ్ళు. ఉదయం వేళ వికారంగా, నీరసం గా వుండటం, వాంతులు నోరు అరుచిగా వుండటం, అయితే ఈ మార్నింగ్ సిక్ నెస్ మంచిదే అంటున్నాయి పరిశోధనలు. ఆరోగ్యవంతమైన గర్భానికి ఇదో సూచన అని పరిశోధకుల అభిప్రాయం. ఇలా వేవిళ్ళు వుండని గర్భావతుల్లో గర్భ విచ్చిత్తి అవకాశాలు ఎన్నో వున్నాయి. కాబట్టి ఈ ఉదయపు వేల విసిగించే వికారం, వాంతులు గురించి చిరాకు పడకుండా పుట్టే బిడ్డ గురించి ఆలోచిస్తూ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఆలోచిస్తూ, కడుపులో పాపాయి తో కబుర్లు చెప్పండి అంటున్నారు పరిశోధకులు.

Leave a comment