దోమల్ని ఇంట్లోకి రాకుండా తరిమి కొట్టాలంటే ఈ మొక్కలు కుండీల్లో పెంచండి అంటున్నారు ఎక్సపర్ట్స్. తులసి నిమ్మగడ్డి బంతి,వెల్లుల్లి ,అజిరేటిమ్,రోజ్ మేరీ సిట్రో నెల్లా గడ్డి లావెండర్ మొక్కలు ఒక ఘాటైన వాసనతో ఉంటాయి. వీటికి దోమల్ని పారద్రోలే శక్తి ఉంటుంది. నిమ్మగడ్డిలో ఉండే సిట్రో నెల్లా నూనెను దోమల నివారణకు ఉపయోగిస్తారు. బంతిలో ఉండే పై రిధ్రమ్ అనే రసాయనం దోమలను తరిమేస్తుంది. రోజ్ మేరీ నుంచి విడుదల అయ్యె రసాయనాలను దోమలు ఆశించవు. ఈ వాసనకు దోమలు పారిపోతాయి. చిన్న కుండీల్లో ఈ మొక్కలు నాటి కిటికీలు వంటగది తలపులు దగ్గర పెడితే దోమలు ఇంటి చుట్టు పక్కలకు రావు.

Leave a comment