చలి,వేడి,వర్షం సీజన్ తో సంబంధం లేకుండా దోమలు చాలా విసిగిస్తాయి.వీటి కోసం స్పెషల్ అగర్ బత్తీలు కూడ వస్తున్నాయి. కానీ మంచి వాసన వస్తున్న ఫీల్ వాళ్ళకి ప్రమాదకరమే అది దోమల్ని చంపే మందే కదా..ఇలాంటి సమస్య లేకుండా బిర్యానీ ఆకు దోమల నివారణకు దివ్య ఔషధం లా పని చేస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. రెండు,మూడు బిర్యానీ ఆకులు ఒక గదిలో కాల్చితే పొగ వస్తుంది. ఆ పొగ బయటికి పోకుండా తలుపులు గడియ పెట్టాలి. పొగ గది మొత్తం చుట్టుముడుతుంది. ఈ వాసనకు దోమలు పరారవుతాయి. ఒక వేళ ఆగదిలో ఉండవలసి వచ్చిన ఆ వాసనకు ఒత్తిడి తగ్గిపోతుంది కూడా. పిల్లలున్న ఇళ్ళలో వాళ్ళకు ఎలాంటి అనారోగ్యాలు రానివ్వదు ఇది.

Leave a comment