అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. మొటిమలు వైట్ హెడ్స్ మచ్చలు మొదలవుతాయి. వాటిని నివారించాలంటే ఆవిరి పట్టటం తప్పనిసరి. దీనివల్ల చర్మం గ్రంధులు తెరుచుకుంటాయి.  మురికి జిడ్డు మృతకణాలు పోతాయి. వేడి నేతిలో ముంచి పిండిన మెత్తని నూలు గుడ్డతో ముఖం తుడిచేసినా ఫలితం ఉంటుంది. చెంచా దాల్చిన చెక్క పొడి ఓట్స్ పిండి తీసుకుని  గోరువెచ్చని నీళ్లతో ముద్దగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి కొద్దిసేపు మర్దనా చేసి పావుగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. మొటిమలు వాటి తా తాలూకు మచ్చలు పోతాయి. రెండు చెంచాల సెనగ పిండి లో సరిపోయేంత పెరుగు వేసి ముద్దగా చేసి ముఖానికి రాయాలి. పది నిముషాలు  అయ్యాక కడిగేస్తే  సరిపోతుంది. ఇందులో పసుపు కలిపితే ఏ సమస్యలు తగ్గటం తో పాటు ముఖం కళగా  మారిపోతుంది. అలాగే నిమ్మరసం లోనే ఆల్ఫా హైడ్రాక్స్  ఆమ్లాలు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. నిమ్మరసంలో దూది ముంచి మొహం పైన రాసి పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

Leave a comment