ప్రకృతి మనకు ఇచ్చే గిఫ్ట్ లకు అంతే లేదు. ఎన్ని తీయనిపండ్లు ,మందులు,కూరలు,కాయలు ,సమస్తం కొన్ని విచిత్రంగా కూడా ఉంటాయి. బ్రెజిల్ లో దొరికే జబుటికాబా పండ్లు చక్కగా పెరిగిన చెట్టు కాండానికే కాస్తాయి.పూవ్వులు ఆ చెట్టు కాండానికే తెల్లని రంగులో చెట్టు మొత్తం కమ్మేస్తాయి. ఈ నల్లని పండ్ల నిండ తియ్యని గుజ్జు ఉంటుంది.నేరుగా ఈ తియ్యని పండ్లను తింటారు.జామ్ లు ,లిక్కర్లు ,వైన్ ల తయారీలో ఉపయోగిస్తారు. ద్రాక్షలా కనిపించే ఈ పండ్లు యాంటీ ఏజింగ్ ,ఇన్ ఫ్లెమెటరీ లక్షణాలు ఉంటాయి.ఎండలో నేరుగా ఎండబెట్టి చేసిన పొడి ఆస్తమా ,డయేరియా ,క్యాన్సర్ మందుగా ఉపయోగపడుతోంది. లెక్కలేనంత ప్రోటిన్ కాల్షియం ,ఐరన్,విటమిన్ బి చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.

Leave a comment