అందమైన ఉంగరం ఎప్పుడు తిరుగులేని ఫ్యాషన్. ఇప్పుడు ఒక్కో వేలిని ఒక్క ఉంగరం తో అలంకరించటం మానేసి కళ్ళను కట్టి పడేసే ఒకే ఒక పెద్ద ఉంగరం పెట్టు కొంటున్నారు అమ్మాయిలు. ఎధ్నక్ ఫింగర్ రింగ్స్ తో పూర్తి బంగారం తో చేసిన అందమైన డిజైన్స్ కనిపిస్తాయి మల్టీ కలర్ గోల్డ్ ప్లేటెడ్ రింగ్స్ లో ఎన్నో వర్ణాలు విరబూస్తున్నాయి. ముత్యాల గుత్తులతో నింపిన బంగారు ఉంగరాలు అందమే ప్రత్యేకంగా ఉంది. కుందన్లు పొదిగినవి,వజ్రాలు,ఇతర విలువైన రాళ్ళు పొదిగినవి,మినాకారి డిజైన్లు ఈ పెద్ద ఉంగరాల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

Leave a comment