కొన్ని పరిశోధనలు ఎంతో ఉపయోగ పడుతూ ఉంటాయి . రాసా మైసిన్ అనే బాక్టీరియా వృద్ధాప్యాన్ని అడ్డుకొంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు . యాభైఏళ్ళ క్రితం ఈస్టర్ దీవినేలలో కనిపెట్టిన ఈ బాక్టీరియాను ,మూత్రపిండాల మార్పిడి సమయంలో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎదురు తిరగకుండా వాడుతున్నారు . తాజాగా ఇది చర్మంలో సాగే గుణాన్ని పెంచి వయసుని పెంచే ప్రోటీన్ ను అడ్డుకొంటున్నదని కనిపెట్టారు . క్రీము రూపంలో ముడతలు పడ్డ చేతుల పైన కొన్ని నెలలు రాయగా చర్మం ముడతలు దాదాపు కనబడకుండా పోయాయి . రక్తంలో ప్రవేశించ లేదు కాబట్టి ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపెట్టలేదు . ఈ బాక్టీరియా తో వార్ధక్యాన్ని అడ్డుకోవచ్చునని చెపుతున్నారు శాస్త్రవేత్తలు .

Leave a comment