నా కోసం దర్శకులు ఫలానా పాత్ర సృస్టించాము అంటే ఎంత బావుంటుంది. ఈ ఆనందాన్ని నేను కొన్నేళ్ళుగా అనుభవిస్తున్నానంటోంది కాజల్ అగర్వాల్. నేను కోరుకుంటే ఏ పాత్ర నా దగ్గరకు రాలేదు. న్యాయం చేయగలననే ధైర్యం తోనే దర్శకులు నన్ను సంప్రదిస్తారు అంటోంది కాజల్. సినిమాల ఎంపికలో ఒక్కో సారి ఒక్కో విషయానికి ప్రాధాన్యత  ఇస్తాము. ఈ మధ్య కాలంలో పాత్రలు నన్ను ప్రభావితం చేస్తున్నాయి. ఆమంచి పాత్ర అని నాకు అనిపించినప్పుడు మిగతా విషయాలు ఏమీ పట్టించుకోకుండా సినిమా చేయాలనిపిస్తుంది. అలా విభిన్నమైన పాత్రలను చేయగలుగుతున్నాను. గతం తో పోలిస్తే నా సినీ ప్రయాణం మూడేళ్ళుగా మరింత సంతృప్తిగా సాగుతుంది అంటోంది కాజల్.

Leave a comment