వర్షపు రోజుల్లో ఇంట్లో తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.కార్పెట్ పై దుమ్ము ధూళి బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతూ ఉంటుంది.అందుకే వర్షపు రోజుల్లో కార్పెట్లు వాడకూడదు.ఈ సీజన్ లో ముదురు రంగుల కర్టెన్లు వాడాలి.రెయిన్ కోట్లు, గొడుగులు ఇంటి బయట బాల్కనీ లోనే వేలాడ దీయాలి. ఫర్నిచర్ లో తేమ లేకుండా ప్రతిరోజు పొడి బట్టతో తుడవాలి.ఇంట్లో ఉతికిన బట్టలు గాలి తగిలేలా ఆరనివ్వాలి.బాగా పొడిగా అయ్యాక నే మడతలు వేసి కప్ బోర్డ్ లో పెట్టాలి.వంటగది సాధ్యమైనంత పొడిగా ఉంచాలి. తేమ వాసన రాకుండా కప్ బోర్డ్ లో నప్తలీన్ ఉండలు పెట్టాలి.

Leave a comment