౩౦ దాటాక ముహంలో గడ్డం కిందనూ నెమ్మదిగా కొవ్వు పేరుకుపోవడం కనిపిస్తూ వుంటుంది. శరీరం మొత్తానికి సరిపోయే వ్యాయామాలు చేస్తారు కానీ మొహం లో పేరుకున్న కొవ్వుని తగ్గించుకునే వ్యాయామాలు ఉంటాయి. ముందుగా శ్వాస బలంగా తీసుకుని బుగ్గల నిండుగా గాలి నింపుకోవాలి. ఆ నింపుకున్న గాలి ఒక్క సారి ఒక్కో బుగ్గలోకి పోనిస్తి వీలైనన్ని సార్లు ఈ వ్యయామం చేయాలి. చంపలు జారి పోవు. వయస్సు భయాలు దగ్గరికి రావు అలాగే బుడగలు ఊదడం కూడా మంచి ఎక్సర్ సైజ్. బుడగ ఊది గాలి వదిలేయడం ఇలా ఐదు సార్లు చేస్తే బుగ్గల్లోని నిగారింపు కనిపిస్తుంది. ముఖంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. అలాగే చక్కర లేని చూయింగ్ గమ్ నమిలినా ముఖంలో కొవ్వు తగ్గుతుంది.

Leave a comment