Categories
WhatsApp

ముఖాకృతిని బట్టే ఎంచుకోవాలి.

ఏ విండో షాపింగ్ చేసినా ఎన్నో రకాల ఇయర్ రింగ్స్, హంగింగ్స్, దిద్దులు కనబడతాయి. కానీ బావున్నాయాని కొనుక్కుంటాం తీరా పెట్టుకుంటే బాగోవు. అందుకే ముఖాక్రుతిని బట్టే నగలు సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఓవెల్ షేప్ ముఖాక్రుతికి ఏ రకమైన ఫ్యాషన్ అయినా సరిగ్గా సరిపోతుంది. చెవులకు అంటినట్లు వుండే దిద్దులు, చెవి మొత్తం కనిపించినట్లు వుండే డిజైన్లు లోలాకులు, ఇంకా వేలాడే హాంగింగ్స్ ఏవయినా బావుంటాయి. అలాగే మోడల్ బీడ్స్ స్టోన్స్ హాంగింగ్స్ కూడా బాగుంటాయి. అలాగే స్క్వేర్ షేప్ వుంటే కొట్టొచ్చినట్లు కనబడేవి కాకుండా పొందికగా వుండే మోడల్స్ తీసుకోవాలి. అందులో బీడ్స్ రంగులు కూడా హుందాగా వుండాలి. ఇక రౌండ్ ఫేస్ అయితే, మెడ పొడవును కూడా పరిగణలోకి తీసుకుని ముఖాక్రుతి హైలైట్ అయ్యే ఆభరణాలు తీసుకోవాలి. పొడవు హాంగింగ్స్ చెవి అంటి పెట్టుకున్న దిద్దులు, మీడియం సైజువి, పెద్దవి ఏవైనా పర్లేదు కనీ వాటి డిజైన్లో రౌండ్ ఉండకూడదు. ముఖాక్రుతిని బట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ బావుంటుంది.

Leave a comment