ముఖంపైన ముడతలు అనిస్తుంటే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్లు గుర్తించమంటున్నాయి అధ్యయనాలు. సాధారణంగా వృద్ధాప్యంలో మొహం,మెడ,చేతులపై ముడతలు కనిపిస్తాయి అవి సహజమే కానీ మధ్య వయసులో 40నుంచి50ఏళ్ళ వయసులో మొహాంపైన ముడతలు వస్తే మాత్రం గుండె సంబంధిత సమస్యలు మొదలవుతున్నాయని గుర్తించి డాక్టర్ ను కలుసుకొండి అంటున్నారు అధ్యయనకారులు.శరీరంపై ఏర్పడే ప్రతి చిన్న మార్పు ఏదో ఒక విషయానికి సంకేతంగా భావించాలి. ముఖంపై ముదతలు అనిపించగానే ఏ ఫేషియల్ కు లేదా యాంటీ ఏ జింగ్ క్రీముల కోసం పరుగులు తీయకుండా దాన్ని అనారోగ్యంగా గుర్తించి ముందు డాక్టర్ సలహా తీసుకోండి అంటున్నారు.

Leave a comment