నీహారికా ,నీకు విసుగొచ్చిన ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు వంక చూసి ముక్కురంబు రుదుట విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని నిందించటం సరైన పనేనా అని . ఏదైనా ఒక పని మొదలు పెట్టినపుడు మన ప్రయత్నలోపం లేకుండా ఉండాలి. ఫలితం సరిగ్గా లేకపోతే మనం చేసిన పొరపాటేక్కడో వెతకాలి. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఆలా ఎన్ని సార్లు ప్రయత్నం చేసి సక్సెస్ అందుకోకపోయినా పరాజయం పొందినట్లు కాదు . ఎప్పుడైతే ఆ పరాజయానికి ఇతరుల శకునాలనీ దురదృష్టాన్ని నిందిస్తారు అప్పుడు ఓడిపోయినట్లు శకునాలు ముహుర్తాలనీ నమ్మేవాళ్ళు తమ ప్రయత్న లోపాల్ని ఎలా గుర్తిస్తారు చెప్పు. శని దశ బాగోక కష్టాలొస్తాయని ఎవరైనా అంటే నవ్వొస్తుందా ? రాదా ? మన జీవితంలో కష్టాలకు కారణం మన గమ్యం సరిగ్గా నిర్ణయించుకోకపోవటం కావచ్చు. మన ఉద్యోగం పోవటానికి కారణం మనం ఆ పని సరిగ్గా చేయకపోవటం కావచ్చు. ఏదైనా మన నిర్లక్ష్యం కావచ్చు. మనం కష్టపడకపోవటం కావచ్చు . అంతేగానీ స్వప్నాలు ప్రశ్నలు శకునాలు ముహుర్తాలు కారణం అవుతాయా చెప్పు.
Categories
Nemalika

ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని తిట్టినట్లు

నీహారికా ,

నీకు విసుగొచ్చిన  ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు వంక చూసి ముక్కురంబు రుదుట  విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని నిందించటం సరైన పనేనా అని . ఏదైనా ఒక పని మొదలు పెట్టినపుడు మన ప్రయత్నలోపం లేకుండా ఉండాలి. ఫలితం సరిగ్గా లేకపోతే మనం చేసిన పొరపాటేక్కడో వెతకాలి. ఆ తర్వాత  మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఆలా ఎన్ని సార్లు ప్రయత్నం చేసి సక్సెస్ అందుకోకపోయినా పరాజయం పొందినట్లు కాదు . ఎప్పుడైతే  ఆ పరాజయానికి ఇతరుల శకునాలనీ దురదృష్టాన్ని నిందిస్తారు అప్పుడు ఓడిపోయినట్లు శకునాలు ముహుర్తాలనీ నమ్మేవాళ్ళు తమ ప్రయత్న లోపాల్ని ఎలా గుర్తిస్తారు చెప్పు. శని దశ బాగోక కష్టాలొస్తాయని ఎవరైనా అంటే నవ్వొస్తుందా ? రాదా ? మన జీవితంలో కష్టాలకు కారణం మన గమ్యం సరిగ్గా నిర్ణయించుకోకపోవటం కావచ్చు. మన ఉద్యోగం పోవటానికి కారణం మనం ఆ పని సరిగ్గా చేయకపోవటం కావచ్చు. ఏదైనా మన నిర్లక్ష్యం కావచ్చు. మనం కష్టపడకపోవటం కావచ్చు . అంతేగానీ స్వప్నాలు ప్రశ్నలు శకునాలు ముహుర్తాలు కారణం అవుతాయా చెప్పు.

Leave a comment