పెరున్న కంపెనీ క్రీమ్, లోషన్ లేదా ఫేషియల్ ముఖాన్ని పూర్తిగా మార్చేస్తాయి అనుకుంటే తప్పే. చర్మం పైన శ్రద్ద చక్కగా నిగనిగలాడే రంగు ఉండాలని కోరుకుంటే క్రమం తప్పకుండా చర్మ వైద్య నిపుణులు, బ్యూటీ ప్రోఫెషనల్స్ ను కలుస్తూ ఉండాలి. ముఖం పైన పెదాల పైన గీతలు కనిపిస్తే ఆ వృద్దాప్యపు లక్షణాలు పోయేలా చికిత్స తీసుకోవాలి. శిరోజాల పరిరక్షణ ,సిపుల్ ఫేస్ వాష్ , మాయిశ్చరైజర్ ,క్రీమ్ ఇవన్ని చర్మానికి సరిపడతాయా లేదా ఎక్స్ పర్ట్ టెస్ట్ చేసి చెబుతారు. యవ్వనవంతంగా కనపడే చికిత్సలన్ని ప్రయోజనకరమైనవి కావు. సెలబ్రిటీలు, హీరోయిన్స్ ఎవరైనా ముందస్తూ జగ్రత్త చర్యలే తీసుకుంటారు. ఎన్నో కన్సల్టేషన్లకు హాజరవుతారు అంతేగాని చర్మం మచ్చలు వచ్చే వరకు జుట్టు సగం ఊడిపోయే వరకు ఆలోచిస్తూ కుర్చోరు.వాళ్లు శరీర సౌందర్యం కోసం పెట్టుబడి పెట్టినట్లే ఆరోగ్య చికిత్సలు చేయించుకుంటారు.

Leave a comment