ఏదైనా ప్రయాణాల్లో తప్పనిసరిగా హోటల్ లో వుండవలసి వస్తుంది. కొన్ని హోటల్స్ గురించి నెట్లో చూస్తే గొప్పగా ఉంటుంది. తీరా బుక్ చేసుకుని అక్కడ దిగాక పరిస్థితి వేరుగా ఉంటుంది. స్టార్ హోటల్ లో దిగే ముందే రూమ్ లో కి వెళ్ళి చెక్ చేసుకుని మంచాలు , దుప్పట్లు , బాత్రూమ్ల క్లీన్ గా ఉన్నాయో లేదో చూసుకుని , తలుపులు పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎంత క్లీన్ గా వున్నా హోటల్ లో కింద కూర్చోవడం , చెప్పులు తీసేసి నడవడం అస్సలు చేయొద్దు. బాత్రూమ్ వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి అప్పుడే బాక్టీరియా పోతుంది. టాయిలెట్ సీట్ పై శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి. మరి అనారోగ్యాలు రావొద్దు అనుకుంటే జాగ్రత్తలు తప్పనిసరి. Hi

Leave a comment