పిల్లలు తప్పులు చేస్తారని వాళ్ళని దండిస్తాం గానీ, వాళ్ళ తప్పులకు పెద్దవాళ్ళే కారణమౌతుందని ఒక సర్వే రిపోర్టు చెప్పుతుంది. పిల్లలపైన ప్రభావం చూపెట్టి పెద్దలే ఒడిలో ఎవ్వాళ్ళతో పోట్లాడ వద్దని చెపుతాం కానీ మనమే పక్కింటి వాళ్ళతో పోట్లడతాం. అప్పుడు పిల్లల మనస్సుల్లో మన పట్ల కలిగే భావం ఏమిటి? మన పట్ల పిల్లలకు విలువ తగ్గదా? పిల్లల పట్ల ప్రేమతో వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చేయాలని చూస్తాం. కానీ అది మన బలహీనతగా వాళ్ళు గుర్తించరు. కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళు ఖచ్చితంగా వ్యవహరిస్తూ వాళ్ళ కోరిక ప్రతి వస్తువు ఇవ్వడం ఉచితమా అనుచితమా అన్న విషయం ఆలోచించి, నిర్ణయించుకోవాలి. అలాగే పిల్లలకు భోజనం పెట్టినా, టిఫెన్ పెట్టినా తినక మారాం చేస్తే వాళ్ళకు బహుమతి ఇస్తామని ప్రామిస్ చేసి దారికి తెస్తాం. పిల్లలు చివరకు తమకేడైనా లాభం ఉంటేనే పని చేయాలనుకొనే పరిస్థితి వస్తుంది. అలాగే ఇతరులతో పోల్చడం అతిగా ప్రశ్నించడం ఏదైనా తప్పే.
Categories