నీహారికా,

పిల్లలకి మంచి అలవాట్లు కావాలంటే ఏం చేయాలని ప్రతి తల్లిదండ్రులు తలకిందలవ్వుతుంటారు. పిల్లలకు పాటల రూపం లోను, కదల రూపంలోను, వాళ్ళకు నచ్చే ఇంకే ఆటల రూపంలో కుడా చెప్పవచ్చు. పూర్వం ఒక రోజు పిల్లలతో వారికి ఎంతో సమస్యగా ఉండేదిట. ఆయన పిల్లాల్ను ఎలా దారికి తీసుకు రావాలో తెలియక విష్ణు శర్మా అనే పండితులకి అప్పగించారు. విష్ణు శర్మ ఆ పిల్లల మనస్సు ఆకట్టుకొని వాళ్ళలో  దయాదాక్షిణ్యం, మంచితనం, ప్రపంచం పట్ల ప్రేమా, ధైర్యం మొదలైన సుగుణాలు రావడం కోసం పంచతంత్రం అనే నీటి కధల పుస్తకం రాసారు. అందులో అన్నీ అడవి జంతువులే ప్రధానంగా ఉంటాయి. ఆ జంతువుల కధలను ఆరేల్ల పాటు పిల్లలకు అర్ధం అయ్యే రీతిలో చెపితే పిల్లలు చదువుకోవటం మొదలు పెట్టి గొప్ప పరిపాలకులు అయ్యారు. మన పిల్లలు అంతే నేర్పితే నేర్చుకుంటారు. ఎటొచ్చీ మనకు సహనం, వాళ్ళు బాగు పడి, ఈ ప్రపంచంలో నీతిగా, ధైర్యంగా బతకాలనే కోరిక వుండాలి.

Leave a comment