“శివాయ పరమేశ్వరాయ చంద్ర శేఖరాయ నమఓం!! భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమఓం”!!

కోనసీమ అందాలు చూసి వద్దాం పదండి.
కాకినాడ సమీపంలో వెలసిన క్షేత్రాన్ని చూసి తరించిపోయే మురమళ్ళ వీరేశ్వర స్వామి. ఈ క్షేత్రంలో భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరుడు భక్తుల కోసం కొలువై ఉన్నారు.
పెళ్లిళ్లు కాని వారికి ఈ స్వామి వారిని దర్శనం చేసుకుంటే తప్పకుండా వివాహం జరుగుతుంది. అందుకే ఈయనకు పెళ్లిళ్ల దేవుడని పేరు.ఇక్కడ స్వామి వారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. భక్తుల కోరికలు తీర్చే శాంత మూర్తులు. భద్రకాళిసమేతుడై వీరేశ్వర క్షేత్రం అనాది నుంచి పూజింప బడుతోంది.దక్ష యజ్ఞం చేస్తున్న సమయంలో పరమ శివునికి జరిగిన అవమానంతో ఉగ్రుడై  శివ తాండవం చేస్తున్న సమయంలో పార్వతి దేవి దేహంలో నుంచి ఒక భాగం ఇక్కడ పడింది. అందుకే ఈ క్షేత్రం భద్రకాళి శ్రీ మురమళ్ళ వీరభద్ర స్వామి గా ప్రసిద్ధి.

ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలు.
మారేడు దళాలు ప్రీతికరం
ఇష్టమైన పూజ: అభిషేకం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పేల పిండి.
పేల పిండి తయారీ: పేలాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో తగినంత బెల్లం వేసి కలిపి చిట్టి చిట్టి ఉండలుగా చేసి స్వామి కి నైవేద్యం సమర్పియామి.

“భో శంభో శివ శంభో స్వయంభో…”
-తోలేటి వెంకట శిరీష

Leave a comment