మురికివాడల్లో ఉన్న కుటుంబాల్లో మానసిక వైకల్యంతో పుట్టిన పిల్లల సంరక్షణ కోసం ఉర్మీ ఫౌండేషన్ ప్రారంభించింది సోనాలీ శ్యామ్ సుందర్. ఆటిజం, సెలిబ్రిటీ సార్స్, ఓన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హాండీక్యాప్డ్ నిర్దేశించిన పద్ధతుల్లో పాఠ్య పుస్తకాలు, ఇతర బోధనా విధానాలు రూపొందించి ఒక బడి పెట్టారు సోనాలీ. ముంబయ్ లోని ధారావి లోని ఈ స్కూల్లో ప్రత్యేక ఉపాధ్యాయులు, స్పీచ్ థెరపిస్టులు పిల్లలకు బోధిస్తారు. ఈ సంస్థ కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తుంది సోనాలీ శ్యామ్ సుందర్. ఒక మంచి పనికి అందరూ సాయం చేస్తారు.

Leave a comment