ఒత్తిడిలో కంటి చూపు కూడా తగ్గే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. ఒత్తిడికి గురయ్యే వాళ్ళలో కార్టి సాల్ అనే హార్మోన్ పెరుగుతుందని అది నాడీ వ్యవస్థపైన దుష్ప్రభావాన్నీ చూపెడుతుంది. దీని ప్రభావం వల్లనే కంటి సమస్యలు వస్తాయంటున్నారు .సంగీతం,యోగా,ధ్యానం ఒత్తడిని దూరం చేసేవే. సంగీతం ప్రభావం మెదడు పైన ఉంటుంది. ఆందోళనను తగ్గించి మానసిక శాంతి ఇస్తుంది. అన్నీ రకాల సంగీతాలు అటువంటి శక్తిని కలగి ఉంటాయని చెప్పలేక పోయినా కొన్ని ప్రత్యేక తరంగాలు నాడులపైన అద్భుత ప్రభావం చూపెడతాయని ,స్వాంతన కలిగిస్తాయని చెపుతున్నారు. మనసుకు ఒత్తడి తెలుస్తుంటే ముందుగా కాసేపు ప్రశాంత పరిచే సంగీతం వినమంటున్నారు.

Leave a comment