బికనీర్ కు ప్రథమ మహిళ ఎస్పీ ప్రీతి చంద్ర రాజస్థాన్ లో ఆమెను అందరూ లేడీ సింగం అంటారు. 2019 లో ప్రీతి చంద్ర ను చంబల్ లోయలోని కరోలీ జిల్లాలో ఎస్పీగా పని చేశారు. సరిగ్గా మూడు నెలల్లో పేరుమోసిన బందిపోట్లు 10 మందిని అరెస్టు చేశారు. ఆమె 2018 ఐ.పి.ఎస్ బ్యాచ్ ఆఫీసర్. సీకార్ జిల్లాలోని కుందన్ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్.ఎఫ్ లో పని చేశారు. తల్లి నిరక్షరాస్యురాలు. నేను ఐ.పి.ఎస్ కావడానికి అమ్మే కారణం అంటారు ప్రీతి. ఈ వ్యవస్థలో మహిళలకు అవకాశాలు రావడం కాస్త కష్టమే కానీ మహిళలు తమ బాధ్యతను మోసేందుకు మనసా ఇష్టపడి కష్టపడాలి. అప్పుడే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటారు ప్రీతి చంద్ర.

Leave a comment