పుస్తకాలు చదివే వాళ్ళలో ఎంతో పరిపక్వత పరిజ్ఞానం సామాజిక దృక్పథం ప్రశ్నించే తత్వం ఉంటాయంటారు విజ్ఞానులు .ఆ లక్ష్యం తోనే పుస్తకాల ఆలయాన్ని గ్రంధాలయం పేరుతో ప్రతి ఊర్లో నూ ఏర్పాటు చేశారు. ఆ లైబ్రరీ లో ఎప్పుడూ కొందరే పుస్తకప్రియులు కనిపిస్తారు. అదొక పాతకాలపు ఇల్లు లాగా కాకుండా పైకి చూస్తేనే ఆకర్షణీయంగా ఉంటే లోపలకు వెళ్లి కాసేపు చదువుకుంటారేమో నని సరికొత్త ఆలోచన చేశారు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ పమేలా సత్పతి కొత్త తరాన్ని ఆకర్షించాలంటే కనువిందు చేసే ఆకృతులతో తీర్చిదిద్దారు నాలుగు వైపులా గోడలు ఉంటే చాలదని వాటిని పుస్తకాల పెయింటింగ్స్ తో నింపేశారు. కాకతీయ వీరవనిత రుద్రమదేవి పుస్తకం  చదువుతున్న విద్యార్థి బొమ్మను భారీగా చిత్రీకరించారు. పెద్దబాలశిక్ష, చివరకు మిగిలేది అముక్త మాల్యద వంటి పుస్తకాలు పేర్లతో సహా వందల పుస్తకాలు ఒక చిత్రాల పేరు గోడలపై చిత్రించారు. ఇది లైబ్రరీ అంటే నమ్మశక్యంగా లేదు పిల్లలకు ఎంతో నచ్చుతుందో పుస్తకాలు ఇష్టపడే వాళ్లకు ఇది ఒక దేవాలయంలాగే ఉన్నది అంటున్నారు చూసినవాళ్లు. పుస్తకాలు చిన్నప్పటినుంచీ చదివే అలవాటు చేస్తే పిల్లలు కెరియర్ కు అదెంతో ఉపయోగపడుతోంది లైబ్రరీలు ఇలా రూపం మార్చుకుని పిల్లలను రారమ్మని పిలిచే లా ఉండాలి. ఒక్కసారి అడుగుపెట్టి ఈ సాహిత్యవనాన్ని ముట్టుకుంటే ఇంకెప్పుడు వదల లేరు పిల్లలైనా, పెద్దలైనా !

Leave a comment