ఎలాంటి ప్రతి ఫలం ఆశించ కుండా ఎంతో మంది సమాజహితం కోరి నిశ్శబ్దంగా పని చేసుకొంటూ పోతారు. సనీతా దేవిది జార్ఖండ్ లోని ఉదయ్ పూర్ . స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా మూత్రశాలలను కట్టేందుకు ముందుకు వచ్చింది. యూనిసెఫ్ సహకారంతో మేస్త్రీగా శిక్షణ పొందింది. తనతో పాటు మరో 300 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి మేస్త్రీలుగా మార్చింది. ట్విన్ పిట్ సాంకేతికతో సునీత టాయ్ లెట్ల నిర్మాణం చేపట్టింది. అందరూ కలిసి 1500 టాయ్ లెట్లు నిర్మించారు. గ్రామాల్లో మహిళలకు పరిశుభ్రత ,బాల్య వివాహాలు మహిళ భద్రత పై అవగాహన కల్పించేందుకు తను ఇప్పటి వరకు 475 మూత్ర శాలలు నర్మించింది. ఈ ఏడాది నారీ శక్తి పురష్కారం అందుకొంది కూడా. కష్టానికి గుర్తింపు తప్పకుండా ఉంటుంది.

Leave a comment