బ్యూటీ పార్లర్ లకు వెళ్ళటం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పత్తులను ఉపయోగించటం నాకు నచ్చదు నా చర్మ సంరక్షణ నేనే చేసుకుంటా అంటోంది  అనుపమ పరమేశ్వర్. కాఫీ తేనే మాస్క్ మాత్రమే ఉపయోగిస్తారు రెండేసి స్పూన్ల చొప్పున కాఫీ పొడి తేనె కలిపి మొహానికి పట్టించి 15 నిమిషాలు ఆగి కడిగేస్తే చాలు ఇది చర్మానికి మెరుపు ఇస్తుంది. కాసేపు వ్యాయామం మంచి నీళ్లు తాగటం వంటివే నా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ అవసరం అయితే తప్ప సినిమాల్లో అవసరమైనంత వరకే మేకప్ వేసుకోవటం అది తక్కువ మొత్తం లోనే ఉపయోగిస్తా అంటుంది అనుపమ పరమేశ్వర్.

Leave a comment