నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఫ్యాషన్ మ్యాగజైన్ హార్పర్స్ బజార్ యు.ఎస్ ఎడిషన్ కు  ఎడిటర్ ఇన్ చీఫ్ గా సమీరా నాజర్ రాబోతున్నారు. 56 ఏళ్ల సమీరా ఫ్యాషన్ రంగ ప్రముఖురాలు .అమెరికాలోనే ఇంకో ప్రసిద్ధి ఫ్యాషన్ పత్రిక వ్యానిటీ ఫెయిర్ కు ఫ్యాషన్ డైరెక్టర్ గా ఉన్నారు.  ‘ఇన్‌స్టెయిల్‌’ పత్రికకు స్టెయిల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు .మొదటిగా అమెరికన్ ‘ఓగ్‌’ పత్రికలో పనిచేశారామె. లెక్స్‌ అన్న పిల్లవాడిని దత్తత తీసుకున్నారు కొడుకు,కెరియర్ తప్ప ఈ ప్రపంచంలో నేను గుర్తించే విషయాలు ఇంకేమీ లేవు అంటారు సమీరా నాజర్.

Leave a comment