సునయనా పాటిల్ చత్తిస్ ఘడ్ కు చెందిన దంతెవాక అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగింది . ఆమెకు అడవికి రక్షణ కల్పించే పోలీస్ ఉద్యోగం చేయాలనీ కోరిక రిజర్వ్ గార్డ్ ఉద్యోగం కోసం పరీక్ష రాసి పాసయింది అప్పటికే ఆమె వివాహం జరిగింది . గర్భంతో ఉంది కాస్తయినా ఆలోచించకుండా ఆ ఉద్యగంలో చేరిపోయింది . ఇప్పుడు ఆమెకు ఎనిమిదవ నెల . 10 కేజీల బ్యాగ్ బుజం వేసుకొని మైళ్ళ కొద్దినడవటం దైర్యంగా కాపలా కాయటం ఆమె బాధ్యతల్లో భాగంగా ఉంటాయి  . ఒక్కసారి నన్ను చూసిన అధికారులు నన్ను విశ్రాంతి తీసుకోమని చెపుతారు కానీ నాకే ఎందుకు ఊరికే కూర్చుబుద్దికాదు నా ఉద్యోగం అంటే నా కేంతో  ఇష్టమో చెప్పలేను అంటుంది సునయన .

Leave a comment