మై లైఫ్ ఇన్ డిజైన్ పేరుతో పుస్తకం తీసుకొస్తోంది గౌరి ఖాన్. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లిష్ చేస్తోంది. ఇంటీరియర్ డిజైనర్ గా తన ఒడిదుడుకులతో పాటు వ్యక్తి గత జీవితం గురించి,కొన్ని అరుదైన ఫోటోలతో ఈ పుస్తకం రాసిందామె. షారుక్ ఖాన్ భార్యగానే కాదు టాలెంటెడ్ ఇంటీరియర్ డిజైనర్ గా కూడా గుర్తింపు పొందింది గౌరి ఖాన్. కరణ్ జోహార్,జాక్విలిన్ ఫెర్నెండెజ్, రణ్ బీర్ కపూర్ వంటి ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లకు డిజైన్ చేసిందామె. ఆ అనుభవాలతో ఈ పుస్తకం వస్తోంది.

Leave a comment