ఇరవై ఏళ్ల క్రితం ఇండియన్ ప్రిన్సెస్ కలెక్షన్ తో కెరియర్ ను ప్రారంభించిన ఫ్యాషన్ డిజైనర్ మాలిని రమణి ఫ్యాషన్ ప్రపంచానికి వీడ్కోలు పలికి యోగా గురు గా మారిపోయింది. ఇరవై ఏళ్లుగా ఆమె ఫ్యాషన్ హౌస్ దేశ, విదేశీ ప్రముఖులను ఆకట్టుకొంది తమన్నా, శిల్పాశెట్టి, తాప్సీ ,ఇషా గుప్తా ,నర్గీస్ ఫఖ్రీ వంటి వాళ్లు ఆమె ఖాతాదారులు గా ఉన్నారు గోవా లోని ఈ డిజైనర్ ఫ్యాషన్ హౌస్ లు ప్రస్తుత కరోనా కారణంగా తెరుచుకోవడం లేదు.ప్రస్తుతం డిజైనింగ్ నుంచి బయటపడి యోగా గురువుగా ఏదైనా చేయాలనుకుంటుంది. ప్రస్తుతం కరోనా యుగం లో ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లలేం  పార్టీ ల కోసం అందమైన దుస్తులు రూపొందించేందుకు ఇది సమయం కూడా అందుకే యోగాను ఎంచుకున్నాను అంటోంది మాలిన రమణి.కరోనా ఇంకెందరి జీవితాల్లో ఇంకెన్ని మార్పులు తెస్తుందో మరి.

Leave a comment